Home News హరిజన వీధిలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

హరిజన వీధిలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

0

ముఖ్య అతిధిగా డాక్టర్ జాన్ వెస్లీ

విశాఖ దొండపర్తి 27వ వార్డ్ హరిజన వీధి శ్రీ విగ్నేశ్వర సేవా సంఘo అధ్యక్షులు గంట్యాడ వెంకటరమణ మరియు గంట్యాడ అప్పారావు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధుగా వై ఎస్ ఆర్ సి పి క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ 27వ వార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు నీలాపు సర్వేశ్వర రెడ్డి పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు ఘన నివాళులర్పించారు అనంతరం పిల్లలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ మాట్లాడుతూ బాబు జగజ్జివన్ రామ్ భారత దేశంలో అత్యంత ఉన్నత స్థాయి పదవులను నిర్వహించారని, బడుగు వర్గాల వారికి అండగా నిలబడి సమాజంలో అరమరికలు లేనివిధంగా చేశారని తెలియ చేశారు.ఈ కార్యక్రమంకు శ్రీ విగ్నేశ్వర సేవా సంఘం సభ్యులు టేకెటి లలిత్ కుమార్, టేకేటి గోవింద్,పంచిరెడ్డి కనకరాజు మన్మధ రావు, గంట్యాడ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version