మంత్రి కందుల చేతుల మీదుగా పంపిణీ
నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు సహాయక వాహనాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పంపిణీ చేశారు.
తదేకం ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మరొకరికి ఎలక్ట్రికల్ స్కూటర్‌ను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాలను సులభతరం చేయడానికి ఇలాంటి సహాయక వాహనాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
దివ్యాంగులకు సహాయక వాహనాలు
RELATED ARTICLES
