Home Politics Andhra Pradesh దివ్యాంగులకు సహాయక వాహనాలు

దివ్యాంగులకు సహాయక వాహనాలు

0

మంత్రి కందుల చేతుల మీదుగా పంపిణీ
నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు సహాయక వాహనాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పంపిణీ చేశారు.
తదేకం ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మరొకరికి ఎలక్ట్రికల్ స్కూటర్‌ను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాలను సులభతరం చేయడానికి ఇలాంటి సహాయక వాహనాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version