ప్రభుత్వ ఆదాయానికి గండి,పాలకులు ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి,పూర్వకాలం నుంచి చారిత్రక నేపథ్యం పరిపూర్ణ ఆదాయం కలిగిన దేవాలయాలు భక్తుల కు ముక్తి ప్రసాదిస్తున్న దేవుళ్ళ స్థిర ఆస్తుల ఆదాయాలు ఎటువైపు చేరుతున్నాయో, ఈ లెక్కలు ఎక్కడ ఉన్నాయో ఏమవుతున్నాయో ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో లేదో ఏళ్ళ తరబడి దేవాలయాల ఆస్తులకు ఆదాయ వనరులు సందిగ్ధంలోనే ఉన్నాయి.
దేవాలయ గోడల పైన సామాజిక పటంలో దేవాలయాల ఆస్తులు, ఆదాయ వివరాల సమాచారం పొందుపరిచిన దాఖలాలు ఎక్కడ లేవు, ఇవన్నీ ఆ దేవాది దేవుళ్ళకి తెలియాలి. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 822 దేవదాయ శాఖ అధికారులు ఉన్నప్పటికీ పలు ఆదాయం వచ్చే దేవాలయాలు ఉన్నాయి, ఇందులో 6ఏ కేటగిరీలో 3 దేవాలయాలు, 6బి లో 16, 6సి లో 784, 6డి లో 18 ఆలయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో ముఖ్యమైన దేవాలయాలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అరసవల్లి, శ్రీ కూర్మానాథ స్వామి ఆలయం శ్రీకూర్మం, శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం శ్రీముఖలింగం, వాసుదేవ్ పెరుమాళ్ ఆలయం మందస, శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం రావివలస, సాలి హుండం బౌద్ధ స్తూపాలు, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం సాలి హుండం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టెక్కలి వీటితోపాటు అతి పురాతన దేవాలయాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి.
ఈ ఆలయాల్లో ధూప దీపం లేక శిధిలావస్థలో ఉన్న గుడిలో గోపురాలు ఉన్నాయి దేవదాయ శాఖ పర్యవేక్షణ లోపాలు స్థానిక ప్రజలకు అంతా తేట తెల్లం, మరి ముఖ్యంగా దేవాలయం భూములు వాటికి సంబంధించిన, సమాచారం, ఆదాయ వనరులు, ఎక్కడికి చేరుతున్నాయో ఎవరి హస్త గతంలో ఉన్నాయో అది దేవుళ్ళకే తెలియాలి, మన దేవాలయాలకు వస్తున్న ఆదాయంతో పలు గ్రామాలు దత్తత తీసుకొని అభివృద్ధి చేయచ్చనే ఆలోచనలు సమాజ హితపరులకు కలుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే అన్యాక్రాంతం భూములు, వ్యక్తులు, యాజమాన్యాలపై ప్రత్యేకమైన పర్యవేక్షణలో జరిపి ప్రభుత్వ ఖజానాకు భంగం వాటిల్లే కబ్జాదారులపై ప్రత్యేకంగా చట్టపరమైన చర్యలు తీసుకొని దేవాలయ భూములను పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.
