Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshకిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

1000 మందికి పైగా ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ

శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు సందర్బంగా  కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వెయ్యి మందికి పైగా  ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గవరపాలెంలోని మళ్ళా జగన్నాధం కళ్యాణ మండపం, పార్క్ సెంటర్ లో జరిగింది. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు, ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణులు, గుండె సంబంధిత వ్యాధులు,లివర్ (కాలేయం) సంబంధిత వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధుల విభాగాలకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. బీపీ (రక్తపోటు), షుగర్ వ్యాధి /

మధుమేహం, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (పల్మనరీ ఫంక్షన్ టెస్ట్), కాలేయ సంబంధిత పరీక్షలు, మామోగ్రఫీ (రొమ్ములకు సంబంధించిన ఎక్స్-రే), బిఎండి (ఎముకల సాంద్రత పరీక్ష), కంటి చూపు పరీక్షలు ఉచితంగా చేశారు.ఈ మెగా వైద్య శిబిరంని కిమ్స్ ఐకాన్ మెనజింగ్ డైరెక్టర్ డా. పి సతీష్ కుమార్ ప్రారంభించారు.మరియు డాక్టర్ గోపాలరాజు మెడికల్ డైరెక్టర్, ఆర్సీఈఓ డాక్టర్ నగేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments