ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చీడికాడ మండలం మంచాలలో నిర్వహిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (11వ తరగతి) ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఎంఈసీ గ్రూప్స్ కి 40 సీట్స్ చొప్పున మొత్తం 160 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా నిర్వహించబడతాయన్నారు. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు.
ఈ నెల 30 లోగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా సెలెక్షన్ కమిటీ ఆమోదంతో ప్రచురించబడుతుంది.ఎంపికైన విద్యార్థులకు పాఠశాల నుండి సమాచారం అందుతుంది. నిర్దేశించబడిన తేదీల్లో సర్టిఫికేట్ ధృవీకరణ పాఠశాలలోనే నిర్వహించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ లో విద్యార్థులకు ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఆధునిక ల్యాబొరేటరీలు, లైబ్రరీ, నైపుణ్యంతో కూడిన ఉపాధ్యాయులు IIT/NEET ఫౌండేషన్ కోచింగ్ అందించబడుతున్నాయన్నారు.దరఖాస్తు రుసుం ఓసీ, బీసీ అభ్యర్థులకు 250 రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 200 రూపాయలు చెల్లించాలన్నారు.
అర్హత గల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లల ఉత్తమ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేయవలనీ కోరారు.
మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
RELATED ARTICLES
