Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshపేదవాడి ప్రాణానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా

పేదవాడి ప్రాణానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా

ఎమ్మెల్యే బండారు

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరప్రదాయినిగా మారుతోందని,ఖరీదైన వైద్యం సామాన్యుడికి భారమవుతున్న తరుణంలో, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక వెన్నుదన్ను అనేక కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.​గురువారం వెన్నెలపాలెం తన స్వగృహంలో ఎమ్మెల్యే బండారు ఇద్దరు లబ్ధిదారులకు సుమారు ₹99,100/- విలువైన చెక్కులను అందజేశారు.
​అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న మాడుగుల నియోజకవర్గం మామిడిపాలెం కు చెందిన నెక్కల సత్తిబాబుకు రూ.62,000/-,పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం సూరెడ్డిపాలెం కు చెందిన
​గొర్లి రమణమ్మ కు రూ.37,100/- సహాయనిది చెక్కులను అందజేశారు.
​కష్టకాలంలో తమ దరఖాస్తును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం అందేలా చేసిన ఎమ్మెల్యేకు బండారుకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.​ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికీ,ఆ పథకం పరిధిలోకి రాని కొన్ని క్లిష్టమైన చికిత్సలకు ఇతర అత్యవసర ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బండారు పేర్కొన్నారు.ఈ
​కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టి ఎన్ టి యు సి అధ్యక్షులు రొంగలి గోపాలకృష్ణ,పరవాడ మండల తెలుగు యువత అధ్యక్షుడు పైల చిన అక్కునాయుడు,లోకిరెడ్డి సన్యాసినాయుడు(అభి ), భోజంకి అప్పలనాయుడు, వెన్నెల గిరి,బండారు నర్సింగరావు పలువురు తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments