Friday, June 5, 2026
HomePoliticsAndhra Pradeshసమస్యలు పరిష్కారానికి అంగన్వాడీలు నిరసన దీక్షలు

సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీలు నిరసన దీక్షలు

సమస్యలు పరిష్కారం కోరుతూ అంగన్వాడి కార్యకర్తలు బుధవారం నిరసన దీక్షలు చేపట్టారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అంగనవాడి  టీచర్లకు,కనీస వేతనం 26000, ఆయాలకు, 20000 పెంచాలని, పెండింగ్ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్స్ చేసి మెయిన్ సెంటర్ గా మార్చాలని,  చట్టబద్ధమైన గ్రాట్యూటీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కొరుతున్నారు. సిఐటియురాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, వి వి శ్రీనివాసరావు జిల్లా అంగన్వాడి యూనియన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగశేషు ,మాట్లాడుతూ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. గత ప్రభుత్వంలో, అంగన్వాడి ఆందోళనకు,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కుప్పం లో జరిగిన అంగన్వాడి ధర్నాలో  పాల్గొని మద్దతు ఇచ్చారని,  అధికారంలోకి వచ్చి రెండు  సంవత్సరాలైనా, వేతనాలు పెంచలేదన్నారు. ధర్నాలోఐ సి డి ఎస్ కి బడ్జెట్ అంగన్వాడీలకు వేతనం పెంచకపోవడం దారుణం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంగన్వాడీలకు తీవ్రమైన అన్యాయం చేసింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేవలం 4259 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం అవసరాలకు ఈ బడ్జెట్ కేటాయింపు సక్రమంగా లేదన్నారు. పౌష్టికమైనటువంటి ఆహారానికి కూడా ఈ బడ్జెట్  సరిపోదన్నారు. అంగనవాడీలకు పెరుగుతున్న ధరలు కనుగుణంగా వేతనాలు పెంచాలని 42 రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా 2024లో జూలైలో వేతనాలు పెంచుతామని రాతపూర్వకంగా  మినిట్స్ఇచ్చిన ఈ బడ్జెట్లో పెంచకపోవడం దారుణం అన్నారు.

రాష్ట్రంలో ఇటీవల కొన్ని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా అప్డేట్ చేశారు ఇంకా కొంతమంది అర్హతకు ఉన్న మెనీ వర్కర్లకు 10వ తరగతి పాస్ మెయిన్ సెంటర్ కి అప్డేట్ చేయలేదు రాష్ట్రంలో మరో 1810 మినీ సెంటర్లో క్వాలిఫై లేదని మెయిన్ సెంటర్ గా మార్చకపోవడం  అన్యాయం అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు వి మాడుగుల మండల కార్యదర్శి ఈ నరసింహమూర్తి యూనియన్ నాయకులు అధ్యక్షులు ఎం జానకి రామలక్ష్మి కొండాజి భాగ్యలక్ష్మి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments