Sunday, May 31, 2026
HomeSpl Storiesఅనకాపల్లి కలెక్టర్ అక్రమాలపై విచారణ చేయాలి

అనకాపల్లి కలెక్టర్ అక్రమాలపై విచారణ చేయాలి

వంద కోట్ల దేవుడి భూమి కైంకర్యానిరి యత్నాలు

దేవుడు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?

కూటమి నేతల కనుసన్నల్లో కలెక్టర్ కాసుల వేట

మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆరోపణలు

అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన వంద కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ జిల్లా కలెక్టర్ అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు, వైయస్సార్సీపీ నేతలతో కలిసి కలెక్టర్ సాగిస్తున్న భూదోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టారు. అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న కన్యాకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన భూమిని జిల్లా కలెక్టర్ అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. 111 ఏళ్ల క్రితం (1915లో) దూరి కామమ్మ అనే మహిళ బ్రాహ్మణ సత్రం కోసం 2.49 ఎకరాల భూమిని దానమిచ్చిన భూమి దేవాదాయ శాఖది కాదని, ప్రైవేటు వ్యక్తులదని కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదని, కేవలం ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే ఏదైనా జరగాలని గుర్తు చేశారు. కానీ ఆఘమేఘాలమీద కూటమి ప్రభుత్వం రాగానే కేవలం రెండు వారాల్లోనే తాసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చేరడం వెనుక భారీ కుంభకోణం ఉందని గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కలెక్టర్, కాసుల కోసం కక్కుర్తి పడి కంచె చేను మేసినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. గడిచిన 20 నెలలుగా అనకాపల్లి కలెక్టర్ తీసుకున్న ప్రతి రెవెన్యూ నిర్ణయం మీద సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దేవుడి భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
గడిచిన రెండేళ్లగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి నేతలు.. తిరుమల లడ్డూతో పాటు రాష్ట్రంలోని ఆలయాలు, ఆలయ భూములు వంటి కేవలం మతాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి పట్టణం నడిబొడ్డున జిల్లా కలెక్టర్ రూ.100 కోట్ల విలువైన దేవాదాయ ధర్మాదాయశాఖ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. 1915లో దూరి కామమ్మ అనే మహిళ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి సత్రం కోసం 2.49 భూమిని దానంగా ఇచ్చారు. 1971 లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి ఈ భూమి వచ్చింది. 2.49 ఎకరాల భూమిలో ఎకరా 38 సెంట్లు భూమి మార్కెట్ యార్డ్ కోసం తీసుకున్నారు. ఇంకా ఎకరా 11 సెంట్లు భూమి మిగిలింది. ఈ భూమిని కాండ్రేగుల సూరప్పారావుకు కౌలుకు అధికారులు ఇచ్చారు. 2025 సెప్టెంబర్ 21న దేవాదాయ శాఖ భూమి కాదు ప్రైవేటు భూమి అని చెప్పి కలెక్టర్ నివేదిక ఇచ్చారు. కలెక్టర్ కు దేవాదాయ శాఖ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం లేదు అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments