Sunday, May 31, 2026
HomePoliticsAndhra Pradeshమార్చి 7న శంకుస్థాపన

మార్చి 7న శంకుస్థాపన

ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కు భూమి పూజ

రూ. 1.35 లక్షల కోట్లు పెట్టుబడి

రెండు దశల్లో నిర్మాణం

భూమి పూజకు ప్రధాని మోడీ హాజరయ్యే ఛాన్స్

అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి మార్చి 7న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా ఇది నిలవనుంది. దీని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు దీని నిర్మాణానికి రూ.1.35 లక్షల కోట్ల వ్యయం కానుంది. ఇప్పటికే ఈ కంపెనీకి ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి. వీలైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేలా ఆర్సెలార్ కంపెనీ సిద్దమవుతోంది. మొత్తానికి ఏపీలో మరో రెండు స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు కానుండటంతో ఆర్ధికంగా, పారిశ్రామికంగా రాష్ట్రానికి ఉపయోగపడనున్నాయని చెప్పవచ్చు. వీటి ఏర్పాటుతో పరోక్షంగా ఎన్నో ఉద్యోగాలు రానున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments