మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ పుట్టినరోజు వేడుకలు గురువారం చోడవరం నియోజకవర్గంలో గల అన్ని గ్రామాల్లోనూ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.ఈ సందర్భంగా నాలుగు మండలాల్లో అభిమానులు కార్యకర్తలు కేక్ కట్ చేసి వివిధ సేవా కార్యక్రమాలను ఆలయాల్లో అభిషేకాలు పూజలు నిర్వహించారు. దాన్లో భాగంగా గోవాడ గ్రామంలో వైసీపీ నేత ఏడువాక సత్యారావు ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. అలాగే చోడవరం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదలకు వస్త్రదానంతో పాటు ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ అన్నవరంలో బియ్యం పంపిణీ, వినాయకుడి గుడి వద్ద కమ్యూనిటీ ఫ్రిడ్జ్ వద్ద ఏడువాక సత్యారావు,పందిరి శ్రీను, ఓరుగంటి నెహ్రూ, తవట్ల బాబురావు, బైన ఈశ్వరరావు, దేవరపల్లి సత్య తదితరులు ఆధ్వర్యంలో 400 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
