Home Politics Andhra Pradesh బీజేపీకి జాతీయ జెండా ఆవిష్కరణ అర్హత లేదని అమర్ జహా బేగ్ విమర్శ

బీజేపీకి జాతీయ జెండా ఆవిష్కరణ అర్హత లేదని అమర్ జహా బేగ్ విమర్శ

0

నగరంలోని నటరాజ్ థియేటర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమర్ జహా బేగ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి జాతీయ జెండాను ఆవిష్కరించే నైతిక అర్హత లేదని తీవ్రంగా విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎన్నో త్యాగాలు చేసిందని, ఆ పార్టీ రూపొందించిన చట్టాలు, పథకాలనే నేడు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూడటం దురదృష్టకరమన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version