Home News ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి

ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి

0

` మహిళలపై నీచమైన భాషలో వికృత ప్రచారాలు
` సభ్య సమాజం తలదించుకునేలా అసత్య ప్రేలాపనలు
` ప్రజలను డైవర్షన్ చేసేలా ప్రసారాలు
` రాధాకృష్ణకు సీఎం, డిప్యూటీ సీఎంల మద్దతుపై ఆగ్రహం
` టూ టౌన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తలించుకునేలా ఏబీయన్ రాధాకృష్ణ ప్రసారం చేసిన వార్తలతో ఆ ఛానెల్ దారుణంగా తయారైందని వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని, మఖ్యంగా పార్టీ నాయకుల భార్యలపై నీఛమైన బాషతో దూషించిన వైనాన్ని నిరసిస్తూ, ఏబిఎన్ రాధాకృష్ణపైన, ప్రచారం చేసిన వ్యక్తులందరిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు గురువారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చారని,మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ మేమంతా మావిగన్ కు సపోర్ట్ చేస్తే వైఎస్సార్సీపీ నాయకులను కించపరుస్తూ ఏబీయన్ రాధాకృష్ణ కొత్తపలుకు కార్యక్రమంలో సంస్కారహీనంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నామన్నారు. ఏబీయన్ రాధాకృష్ణ టీడీపీ, జనసేన పార్టీ నాయకుల రాసలీలలు ప్రతి 15 రోజుల కొకసారి బయటకు వస్తున్నాయని,వాటిపై కూడా సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించాలన్నారు. మహిళలను కించపరిచిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని, మహిళాభివృద్దికి పెట్టపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఏమి సమాధానం చెబుతారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాధాకృష్ణకు మద్దతు తెలపడం దారుణమని, ఇదే పంథాలో కొనసాగితే ఆంధ్రరాష్ట్రంలో మహిళా లోకమంతా ఏబీయన్ ఛానెల్ ను బ్యాన్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్స్,వార్డ్ ప్రెసిడెంట్స్, జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు, వార్డ్ నాయకులు, మహిళా నాయకురాలు,తదితరులు పాల్గొన్నారు,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version