Home Politics Andhra Pradesh మున్సిపల్ పాలకవర్గానికి ఘన వీడ్కోలు

మున్సిపల్ పాలకవర్గానికి ఘన వీడ్కోలు

0

కొవ్వూరు పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ తుది సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం పాలకవర్గానికి పదవి వీడ్కోలు సభను ఏర్పాటు చేసి సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు పాలకవర్గం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, జనసేన ఇంచార్జ్ టీవీ రామరావు కూటమి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version