- నిస్సహాయ ఒంటరి మహిళకు అండగా స్టార్ బ్యూటీస్ బృందం
- నిత్యావసర సరుకులు అందజేత
శ్రీకాకుళం – జయ జయహే
స్థానిక కృష్ణాపార్కు కూడలిలో నివాసముంటున్న, నిస్సహాయ ఒంటరి మహిళ, వైశ్యరాజు.సంతోషి కుమారి కుటుంబానికి, శ్రీకాకుళం స్టార్ బ్యూటీస్ సభ్యుల బృందం అండగానిలిచింది. ఇటీవలే వైశ్యరాజు.సంతోషి కుమారి భర్త వైశ్యరాజు.కృష్ణంరాజు గుండెపోటుతో తనువుచాలించారని, గతంలో ఆమె భర్త ఒక వర్తకుని వద్ద దినసరి కూలీగా పనిచేసుకుంటూ కుటుంబ పోషణ కొనసాగించేవారని, ఇద్దరు చిన్న పిల్లలు ఊహ తెలియని స్థితిలో ఉన్నారని, కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవటంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని కాస్మొటాలజిస్ట్ ప్రిస్కిల్ల గిరిరాజ్ సోమవారం తెలిపారు. సంతోషి స్నేహితురాలు శాంతి, సేవకులు ఉర్లం.శివతేజ పట్నాయక్ ద్వారా విషయం తెలుసుకుని, ఈ రోజు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు, రైస్ ప్యాకెట్ తోపాటు కూరగాయల రూపంలో చిరుసాయమందించామని, రానున్న రోజులలో ఆమెకు అండగా నిలుస్తామన్నారు. అనంతరం సామాజిక సేవకులు ఉర్లం.శివతేజ మాట్లాడుతూ అడిగిన వెంటనే సహాయమందించిన కాస్మొటాలజిస్ట్ ప్రిస్కిల్ల గిరిరాజ్ బృందానికి ప్రత్యేకధన్యవాదాలని, ఈ కుటుంబానికి ఎటువైపు చూసినా ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయని, మనసున్న దాతలు నేరుగా గాని, బాధితురాలు ఫోన్ పే ద్వారాగాని ( ) ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సేవా కార్యక్రమంలో శాంతి, రమాదేవి, కవిత, శారదా , సావిత్రి, లావణ్య, శశికళ, సత్య మీనాక్షి, సంధ్య, నసీమ, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
