Home Politics Andhra Pradesh మహాత్మునికి ఏపీఈపీడీసీఎల్ లో ఘన నివాళి

మహాత్మునికి ఏపీఈపీడీసీఎల్ లో ఘన నివాళి

0

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్బంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో మహాత్మునికి సంస్థ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ కాంశ్య విగ్రహానికి సంస్థ డైరెక్టర్లు టి.వనజ, టి.వి.సూర్యప్రకాష్, సిజిఎం లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ ఆపరేషన్స్ టి.వి.సూర్యప్రకాష్ మాట్లాడుతూ అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని అన్నారు. కార్యక్రమంలో సీజీఎం లు వి.విజయలలిత, డి.సుమన్ కళ్యాణి, బి.అశోక్ కుమార్, ఎల్.మహేంద్రనాధ్, ఎల్.దైవప్రసాద్, ఎస్.విజయప్రతాప్, జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version