విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెం రెడ్డి సతీష్ కుమార్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా మాట్లాడుతూ.. “ప్రతి ఇంట్లో వెలుగులు నింపేది మహిళేనని, గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పొంది మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని” ఆకాంక్షించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు ప్రతి సోదరీ సోదరీమణలు వినియోగించుకోవాలని
మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు
– గ్రంథాలయాల్లో మహిళల కోసం మరిన్ని ప్రత్యేక వసతులు కల్పిస్తామని శాఖ గ్రంధాలయ సెక్రెటరీ బుర్రి కుమార్ రాజా పేర్కొన్నారు
. గ్రంథాలయాల్లో చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు
కె. రమాప్రభ (సామాజికవేత్త) – మహిళా హక్కులు, బాధ్యతలు గురించి అవగాహన కల్పించారు సంధ్యారాణి గారు (క్వీన్ మేరీ పాఠశాల ఉపాధ్యాయురాలు) – చిన్నారులకు చిన్నతనం నుండే పుస్తక పఠనం అలవాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.. గత 50 ఏళ్లుగా గ్రంథాలయానికి వస్తూ పుస్తక పఠనం చేస్తున్న సీనియర్ పాఠకురాలు యం. చిట్టి నారాయణమ్మ ను ఘనంగా సన్మానించారు. ఆమె పఠనాసక్తి మనందరికీ ఒక పెద్ద పాఠం!
అలాగే, నిరంతరం గ్రంథాలయాలకు సేవలందిస్తున్న మహిళ గ్రంథపాలకులను కూడా ఈ సందర్భంగా సన్మానించుకోవడం జరిగింది

