Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

రామచంద్ర పురం లోని రత్నంపేట మునిసిపల్
హైస్కూల్ లో ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్ శ్రీనివాస పద్మావతి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనం గా జరిగాయి.ఈ సందర్భంగా పాఠశాల లోని మహిళా ఉపాధ్యాయిని లను మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ను ఉపాధ్యాయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. పూర్వ కాలంలో స్త్రీ లకు చదువుకునే అవకాశం లేదు. కానీ నేడు అందరికీ విద్య అందుబాటు లోకి రావడంతో ప్రస్తుత కాలంలో మహిళ లందరూ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ధీటుగా రాణిస్తున్నారు అని ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతి అన్నారు.సమాజం లో ఏదైనా సాధించాలంటే విద్య చాలా అవసరమని కావున ప్రతి ఒక్కరూ శ్రద్ధ గా చదవాలని విద్యార్దిని విద్యార్దులు కు సూచించారు. ఇంత ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను నిర్వహించిన ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments