Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshసిటీలో డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి

సిటీలో డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి

టూ వీలర్స్ ప్రమాదాలు ఎక్కువ
– స్టాల్స్ లో ఫుడ్ సేఫ్టీ ముఖ్యం
– ప్రమాదాలు లేకుండా డ్రైవింగ్ చేయాలన్న ఆర్టీసీ ఆర్ ఎం

ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు శనివారం ద్వారకా బస్ స్టేషన్ ను తనిఖీ చేసారు. ఈ సందర్బంగా డ్రైవర్లతో మాటాడారు. రానున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. టు వీలర్స్ ప్రమాదాలు ఎక్కువగా సిటీలో ఉన్నాయని దీనిని నివారించుటకు ముందుగా గమనించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని బట్టి డ్రైవింగ్ చేయాలన్నారు. విశాఖ సిటీలో ఎల్లప్పుడూ డిఫెన్స్ డ్రైవింగ్ చేయాల్సిందేనని ఆదేశించారు. గత రెండు వారాల నుండి ఏపీఎస్ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లకు హాన్ కాల్ డ్రైవర్లకు ప్రైవేటు లిజి బస్సుల డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి వారి దగ్గర సందేహాలను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వారికి డ్రైవింగ్ స్కిల్స్ పెరిగేలాగా ప్రతి మంగళవారము శుక్రవారం ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ లో ఉన్న డ్రైవర్లతో వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఉపదేశించారు. ద్వారకా బస్ స్టేషన్ లో ఉన్న స్టాల్ యజమానులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ పాటించాలని, పాటించని వారిపై చర్య తీసుకుంటామని తెలియజేసారు. ఈనెల 16వ తేదీ నుండి జరిగే పదవ తరగతి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు వారి హాల్ టికెట్ పై ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా తెలియజేసి అన్నారు. సిబ్బంది కూడా తప్పనిసరిగా విద్యార్థులకు సహకరించి బస్ స్టేజిలో వారికి ఎక్కించుకొని ఎగ్జామ్ సెంటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరవేయాలని తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా మార్చి 8వ తారీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మద్దిలపాలెం డిపోలో విశాఖ జిల్లా లో ఉన్న మహిళా ఉద్యోగులుతో సాయంత్రం మూడు గంటలకు సమావేశం ఏర్పాటు చేసి బాగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ విశాఖ జిల్లా మహిళలు మద్దిలపాలెం డిపోలో జరుగుతున్న కార్యక్రమానికి సాయంత్రం మూడు గంటలకు హాజరుకావాలని తెలియజేసియున్నారు. ద్వారకా బస్ స్టేషన్ తనిఖీలో అసిస్టెంట్ మేనేజర్ నాయుడు స్టేషన్ మేనేజర్ రామారావు, వివిధ డ్రైవర్లు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments