Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshసీనియర్ జర్నలిస్టు జగదీశ్ కు వైసీపీ నేతలు పరామర్శ

సీనియర్ జర్నలిస్టు జగదీశ్ కు వైసీపీ నేతలు పరామర్శ

ఇటీవల పితృవియోగం పొందిన సీనియర్ జర్నలిస్టు అధికారి జగదీశ్వరరావును పలువురు నేతలు పరామర్శించారు. వడ్డాదికి చెందిన సీనియర్ జర్నలిస్టు జగదీశ్వరరావు తండ్రి కోటేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం వడ్డాదిలోని వారి స్వగ్రాహానికి వెళ్లి జగదీశ్వర రావు తండ్రి స్వర్గీయ కోటేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.గుడివాడ వెంట జడ్పిటిసి దొండా రాంబాబు, పి భీమవరం సర్పంచ్ పినుపోలు రామునాయుడు, టౌన్ వైసీపీ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల రామకృష్ణ ఉన్నారు.అంతకుముందు ప్రభుత్వ మాజీ విప్, ఎలమంచిలి వైసిపి ఇన్చార్జి కరణం ధర్మశ్రీ, వైసిపి జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ కూడా జగదీశ్వరరావును పరామర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments