దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి.
తన సేవా కార్యక్రమంలో భాగంగా 35వ వార్డులో సీనియర్ కార్యకర్త సిమ్మ పుష్ప కుటుంబానికి వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో రూ. 5000 రూపాయలు చేయూతనందించారు.
35వవార్డు అధ్యక్షుడుఅలుపన కనకారెడ్డి ద్వారా విషయం తెలుసుకొని వైసిపి సీనియర్ కార్యకర్త పుష్ప భర్త సిమ్మ శ్రీను హార్ట్ ఎటాక్, షుగర్ వ్యాధితో ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో వార్డు వైసీపీ శ్రేణులతో కలసి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మెడికల్ ఖర్చులకు సాయం అందించి భరోసా కల్పించారు. కాసేపు వారితో మాట్లాడి ధైర్యం అందించారు. నియోజకవర్గంలో ప్రజలతో పాటు తనతో నడిచే వైసీపీ శ్రేణులకు కష్టమంటే తోడుండే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ అని పలువురు ప్రశంసిస్తున్నారు. సొంత నిధులతో అధికారంలో లేకున్నా కూడా సేవలు కొనసాగిస్తున్న ఏకైక నాయకుడు తమ వాసుపల్లి గణేష్ కుమార్ అని దక్షిణ శ్రేణులు కొనియాడుతున్నారు.
సీనియర్ కార్యకర్త కుటుంబానికి వాసుపల్లి చేయూత
RELATED ARTICLES
