Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshకల్తీ పాలు ఘటన: మరో వృద్ధుడి మృతి

కల్తీ పాలు ఘటన: మరో వృద్ధుడి మృతి

పట్టణంలో చోటుచేసుకున్న పాలు కల్తీ ఘటన నేపథ్యంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరొకరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ జి. సూర్యారావు (81) మంగళవారం దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె. వెంకటేశ్వరరావు వెల్లడించారు.
మృతుని కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రస్తుతం మొత్తం 13 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కిమ్స్ ఆస్పత్రిలో 6 మంది, డెల్టా ఆస్పత్రిలో 3 మంది, రెయిన్బో చిల్డ్రన్ ఆస్పత్రిలో 3 మంది, రవి చైతన్య ఆస్పత్రిలో 1 వ్యక్తి చికిత్స పొందుతున్నారు.
రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిపుణుల వైద్యుల ఆధ్వర్యంలో సముచిత చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన అన్ని వైద్య చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments