Saturday, April 18, 2026
HomeUncategorizedమనిషిని జ్ఞానమార్గంలో నడిపించేది భగవద్గీత-సిహెచ్ అప్పలనాయుడు

మనిషిని జ్ఞానమార్గంలో నడిపించేది భగవద్గీత-సిహెచ్ అప్పలనాయుడు

  • మనిషిని జ్ఞానమార్గంలో నడిపించేది భగవద్గీత..
  • కార్తీక దీపం వెలిగించడంలో జ్ఞానాన్ని గ్రహించాలి
    సిహెచ్ అప్పలనాయుడు

మక్కువ, నవంబర్ 3, (జయ జయహే):-
మనిషిని జ్ఞాన మార్గంలో నడిపించేది భగవద్గీతే నని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి బొబ్బిలి కమిటీ అధ్యక్షులు సిహెచ్ అప్పలనాయుడు అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ మండలంలో డి శిర్లాం, లోవరకండి , దబ్బగడ్డ , కోన, గోపాలపురం, తూరు మామిడి, శాంతేశ్వరం గ్రామాలలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి బొబ్బిలి కమిటీ ఆధ్వర్యంలో ప్రచార వాహనం ద్వారా త్రైత సిద్ధాంత భగవద్గీత గూర్చి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషిని జ్ఞానమార్గంలో నడిపించేది శ్రీకృష్ణ పరమాత్ములు ప్రబోధించిన భగవద్గీతేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కార్తీక పౌర్ణమికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించడం అందులోని జ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సోమవారం అనేది ఆత్మ జ్ఞానం కు గుర్తు , మంగళవారం మోక్షం కు గుర్తు అని మనిషి తెలుసుకోవాలన్నారు. దీపం యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
ప్రమిద , మనిషి శరీరం మట్టి తో సమానం అని గుర్తించాలి. రెండు వత్తులు ,జీవాత్మ ఆత్మ ల కలయిక కు గుర్తు , వత్తులు వెలిగించే నిప్పు , గురువు ఇచ్చే జ్ఞానాగ్ని కి గుర్తు , నూనె ,మనిషి జీవితం కు, జన్మ కు కారణమైన కర్మ భావించాలని వారు ప్రబోధించారు. దీపం వెలుగుట గురువు ఇచ్చిన జ్ఞానాగ్ని ఆరిపోకుండా వెలిగేలా ఉండాలంటే జీవుడు ఆత్మ తో యోగం అవ్వాలి. అందుకే రెండు వత్తులను పెన వేసి దీపం వెలిగిస్తారని ఆయన తమ ప్రచారంలో వివరించారు. ప్రమిద లో నూనె అయిపోయి రెండు వత్తులు కాలి పోయినప్పుడు , మట్టి ప్రమిదలను పారవేయడం అంటే.? మనిషి కి కర్మ అయిపోతే ఎలా చనిపోతాడో.! అలాగే యోగ సాధన వలన యోగాగ్నిలో కర్మ కాలిపోతే జీవాత్మ మోక్షం పొందుతుందన్నారు. మనిషి తనలో కర్మ అనే నూనె అయిపొతే , జీవుడు ఆ శరీరం విడిచి పెడతాడు. అపుడు ఆ దేహం లో ఇక జీవం లేదని, మట్టి ప్రమిద లను మట్టి లో కలిపి వేస్తారని గ్రహించాలని ఆయన అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి బొబ్బిలి కమిటీ అధ్యక్షులు, సభ్యులు సిహెచ్ అప్పల నాయుడు , యం వెంకటేశ్వరరావు , సత్యనారాయణ, పద్మావతి, గణపతి , ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments