Friday, June 5, 2026
HomePoliticsAndhra Pradeshఅదుపుతప్పిన చోడవరం చలపతి ప్రైవేట్ పాఠశాల బస్సు

అదుపుతప్పిన చోడవరం చలపతి ప్రైవేట్ పాఠశాల బస్సు

చోడవరంకి చెందిన చలపతి ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా బుధవారం సాయంత్రం మాడుగుల మండలం కోటపాడు ప్రాంతంలో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు.రోజు మాదిరిగానే పాఠశాల విడిచిన తర్వాత చోడవరం నుండి విద్యార్థులను తిరిగి ప్రయాణంలో పిల్లలను చేర్చుతున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు సిమెంట్ స్తంభాలపై నుంచి పంట పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న మాడుగుల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోనీ డ్రైవర్ని అదుపులోకి కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments