Friday, June 5, 2026
HomePoliticsAndhra Pradeshతల్లి బిడ్డను హోంకి చేర్చిన జిల్లా మిషన్

తల్లి బిడ్డను హోంకి చేర్చిన జిల్లా మిషన్

దిక్కు ముక్కు లేని ఒక తల్లి బిడ్డను జిల్లా మిషన్ వారు విశాఖ హోమ్ కు చేర్చన సంఘటన బుధవారం చోడవరంలో జరిగింది. తమకందున ఫోన్ సమాచారం ఆధారంగా అనకాపల్లి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ కె మేరీ సువార్త, ఓఎస్సీ సిబ్బంది, డిసిపియు సిబ్బంది చోడవరం ట్రెండ్స్ షాప్ దగ్గర రోడ్డుమీద ఉన్న
ఒక మహిళ, ఆమె రెండేళ్ల కుమార్తెను పోలీసుల సహాయంతో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరికి ఇల్లు కాని బంధువులు కానీ లేకపోవడంతో హోమ్ లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీంతో సాయంత్రం ఓ ఎస్ సి వాహనంలో విశాఖ శక్తి సధనలో వారిని చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ మంగ, సిడబ్ల్యు సరస్వతి, మహిళ పోలీస్ లక్ష్మి, ఓఎస్సీ సెక్యూరిటీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments