చోడవరం నియోజవర్గ పరిధిలో గల కన్నంపేటకు చెందిన దంట్ల చంద్రశేఖర్ అనారోగ్యానికి గురయ్యారు.వారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 26వేల రూపాయలు మంజురవడంతో ఆ చెక్కును బుధవారం చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా వారికి అందజేశారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల చూపిస్తున్న మానవతా దృక్పదం చాలా గొప్పదని ఈ సహాయ నిధి వలన ఎంతో మందికి ఉపసమనం కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నంపేట గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు దంట్ల శివ తదితరులు పాల్గొన్నారు.
