Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshఈనెల 20 నుంచి యేసయ్య సువార్త స్వస్థత ఉజ్జీవ సభలు

ఈనెల 20 నుంచి యేసయ్య సువార్త స్వస్థత ఉజ్జీవ సభలు

22న మడికి సుగుణమ్మ 17వ వార్షిక జ్ఞాపకార్థ కూడిక
ఈనెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మూడు రోజులపాటు యేసయ్య సువార్త స్వస్థత ఉజ్జీవ సభలు రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లాజరస్ సుగుణ మెమోరియల్ పెంతేకొస్తు దేవుని సంఘము ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమాలను రెవ. మడికి పరంజ్యోతిబా, మేరీ కుమారి సారథ్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే సభల్లో ఆత్మీయ సందేశాలు, ప్రత్యేక ప్రార్థనలు, రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు నిర్వహించబడతాయని తెలిపారు.
సభలకు ఏడిద సిలోహు ప్రేయర్ టెంపుల్ బిషప్ డా. పి.టి. జేమ్స్ పాల్, ఒంగోలుకు చెందిన రెవ. కె. జోసఫ్, పాలచర్ల క్రైస్ట్ సెంటర్ మినిస్ట్రీస్‌కు చెందిన సహో. గ్రేస్ విక్టర్ వాక్యోపదేశకులుగా హాజరవుతారు.
ఆఖరి రోజు 22న శ్రీమతి మడికి సుగుణమ్మ 17వ వార్షిక జ్ఞాపకార్థ కూడిక ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, స్మరణ సభ జరుగుతుంది.
మూడు రోజులపాటు జరిగే ఈ ఆధ్యాత్మిక సభల్లో లవ్లీ ఆర్కెస్ట్రా, స్థానిక సంఘం, లవ్లీ క్వయర్ సభ్యులు ఆత్మీయ మధుర గీతాలతో భక్తులను ఆకట్టుకోనున్నారు.
ఈ సభలను విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రెవ. మడికి పరంజ్యోతిబా, మేరీ కుమారి, సంఘ పెద్దలు మరియు యూత్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments