రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఓకే
ఐటీ, విద్యుత్, టూరిజం ఫుడ్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లు
ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో బుధవారం 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులపై మాట్లాడారు. మొత్తం రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 56,692 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాశ్, సీఎస్ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
