Friday, June 12, 2026
HomePoliticsAndhra Pradeshనియోజకవర్గ అభివృద్ధిపై

నియోజకవర్గ అభివృద్ధిపై

మంత్రి సంధ్యారాణి. దొన్ను దొర సమీక్ష

నియోజకవర్గాల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం పార్వతీపురం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అరకు పార్లమెంట్ పరిధిలో గల శాసనసభ్యులు,తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత నిధులు అవసరమవుతున్నాయి? ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయనే అంశాలపై సమీక్షించారు. అరకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నివేదిక ఈ సందర్భంగా సియ్యారి దొన్ను దొర ఈ సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఏ యే గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి? ఎక్కడెక్కడ రోడ్ల అవసరం ఉంది. వైద్య సదుపాయాలు, హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి, ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తన నియోజకవర్గంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాంతాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments