మాడుగుల మండలం కింతలి జిల్లా పరిషత్ హై స్కూల్ మంగళవారం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఆర్ట్ వేసిన మాడుగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పుట్టా రోహితును అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
