Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshకేజే పురం పంచాయతీ అభివృద్ధికి సహకరించండి

కేజే పురం పంచాయతీ అభివృద్ధికి సహకరించండి

గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంత అవసరమని ఎండిఓ కే అప్పారావు చెప్పారు. శుక్రవారం మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఆదాయం ఎంత అవసరమని ఇందుకు ఇంటి పన్నులు ప్రతి ఒక్కరు చెల్లించాలని కోరారు. తద్వారా సిబ్బంది జీతభత్యాలు, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. ఇందుకుగాను ప్రజలు సహకారం అందించాలని కోరారు.అలాగే పింఛన్ ల పంపిణీ లోనూ, తడి చెత్త- పొడి చెత్త వేరు చేయడoలోనూ అనుసరించాల్సిన విధానాలను కూడా అయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇంటి పన్నుల వసూలు కొరకూ పంచాయతీ అభివృద్ధి అధికారులు, వివో ఏ లు అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు , క్లస్టర్ ఇంచార్జి బి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments