Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshహట్టహాసంగా మహా శివోత్సవం ఏర్పాట్లు

హట్టహాసంగా మహా శివోత్సవం ఏర్పాట్లు

మొట్టమొదటిసారిగా అరుణాచలేశ్వరుని కళ్యాణం* భక్తుల కోసం అదనంగా మరో 5వేల శివలింగాలు*భక్తుల నుంచి భారీగా స్పందన . ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్*రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం మరియు అనంతపురం ప్రజల ఆయురారోగ్య అశ్వరాలతో క్షేమంగా ఉండాలని సంకల్పంతో నగరంలో మహాశివరాత్రి రోజున మహా శివోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీఐఐసి డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ తెలిపారు. అరుణాచలేశ్వరుని కళ్యాణం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా జరుగుతోందన్నారు. అనంతపురంలో తొలిసారిగా జరుగుతున్న 10800 శివలింగాల అభిషేకంలో పాల్గొనాలని, అరుణాచలేశ్వరుని కళ్యాణం కనులారా తిలకించాలని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పాస్ ల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. భక్తుల నుండి వస్తున్నా స్పందన చూసాక, ముందుగా అనుకున్న 10800 శివలింగాలకు అందనంగా మరో ఐదువేల శివలింగాలను తెప్పిస్తున్నట్టు లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. భక్తులు ఇంకా ఎక్కువ వచ్చినా కూడా, ప్రతి ఒక్కరు కనీసం ఒక గ్లాస్ పాలతో అయినా శివుడికి అభిషేకం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభిషేకానికి కావలసిన పూజా సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నామన్నారు. భక్తుల కోసం అల్పాహారం, త్రాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. అరుణాచలేశ్వరుని కళ్యాణోత్సవ అనంతరం, అరుణాచల దేవస్థాన ఆచారం ప్రకారం ఏక హారతి, నక్షత్ర హారతి, నందిహారతి లాంటి అనేక హారతులతో పాటు మహా మంగళహారతి కార్యక్రమం ఉంటుందని ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments