ట్రోఫీ ఆవిష్కరించిన హీరో సుమన్,కేఎన్ఆర్ సతీష్ 15వ ఏపీ వొడాకాయ్ కరాటే డు ఛాంపియన్షిప్ ట్రోఫీను సినీ హీరో, మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. హెచ్ బి కాలనీ డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుమన్ తల్వార్, విశిష్ట అతిథిగా బిజెపి రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్ణంరెడ్డి నరసింగరావులు విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ వేదికగా కరాటే పోటీలను నిర్వహించడం విశాఖ పేరు ప్రతిష్టలు మరింతగా ఇనుమడిస్తాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం చిన్న విషయం కాదన్నారు. క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలన్నారు. వొడాకాయ్ కరాటే డు కరాటే సంఘం అధ్యక్షుడు సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మార్చి 1న మురళినగర్ బొత్స స్క్వేర్ లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఛాంపియన్షిప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, బిజేపి నేత బొత్స సురేష్, కరాటే స్టేట్ డైరెక్టర్ అనిల్, ఏక్సిస్ బ్యాంకు ఉద్యోగి ఉషారాణి, సీనియర్ కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.
