Friday, May 1, 2026
HomeUncategorizedఅభివృద్ధి పనులకు గంటా శంకుస్థాపన

అభివృద్ధి పనులకు గంటా శంకుస్థాపన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని 9 జీవీఎంసీ వార్డుల్లో రూ. 160 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. 2 వ వార్డు పరిధిలోని సబ్బివాని పేట, దొరతోట, డెక్కాతి పేట, సంగివలస, రాజలింగం పేట, కుమ్మరివీధి తదితర ప్రాంతాల్లో రూ. 4.15 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి హయాంలో వెల్లువలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2014-19 మధ్య భీమిలి ఎమ్మెల్యేగా, మంత్రిగా రికార్డు స్థాయిలో రూ. 4,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. ఇప్పుడు అదే స్థాయిలో అభివృద్ధి చేసి 93 వేల రీసౌండ్ మెజారిటీ ఇచ్చిన భీమిలి ప్రజల రుణాన్ని తీర్చుకుంటానన్నారు. కార్యక్రమంలో భీమిలి జోనల్ కమిషనర్ టి. నాగేంద్ర కుమార్, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, భీమిలి జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు గంటా నూకరాజు, జీరు సత్యం, తమ్మిన సూరిబాబు, దండి వెంకటేష్, కొప్పల రమేష్, గొలగాని నరేంద్ర, పాసి నరసింగరావు, సూరాల సత్య వర ప్రసాద్, గరికిన కింగ్ తదితరులు పాల్గొన్నారు.

*పీజీఆర్ఎస్ లో పాల్గొన్న గంటా*

భీమిలి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. మంచినీటి సరఫరా.. హౌసింగ్.. తదితర అంశాలపై వచ్చిన వినతులకు నిర్దిష్ట గడువులోగా పరిష్కారం చూపించాలన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్ కూడా పాల్గొన్నారు

*స్విమ్మర్ కు అభినందన*

నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మూడు బంగారు పతకాలను గెలుచుకున్న చింతపల్లి అనితను గంటా శ్రీనివాసరావు సోమవారం జీవీఎంసీ భీమిలి జోనల్ కార్యాలయంలో అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments