వేపగుంట – పినగాడి రోడ్డు నిర్మాణ పనులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. పెందుర్తి జోన్ జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను వెంటబెట్టుకుని రోడ్డు పురోగతి గురించి అడిగి తెలుసుకుని విస్తరణలో భాగంగా కరెంటు స్తంభాల మార్పిడి, కల్వర్టుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఇబ్బందులన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్, డి ఇ పార్వతి, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయితే సింహాచలం, ఏఎంసీ డైరెక్టర్లు ఆర్ఎస్ నాయుడు, హైమావతి , వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్, పిన్నింటి పార్వతి, పార్టీ సీనియర్ నాయకులు గొర్లె అప్పారావు,తనకాల శ్రీనివాసరావు, మోటూరు చైతన్య , కర్రీ శివ, పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
వేపగుంట – పినగాడి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల
RELATED ARTICLES
