టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు పేద, మధ్యతరగతి ప్రజల కళ్ళల్లో ఆనందమే ద్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో భీమిలి జోన్ 3వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణీ కార్యక్రమంలో గంటా నూకరాజు పాల్గొన్నారు. నేరళ్లవలస కోలనీ, బోయవీధి, ఎగువపేట, రెల్లివీధి ఏరియాలో పాల్గొని లబ్ధిదారులకు ఫింఛన్లు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఆనందంలో ఉన్నారని అన్నారు. భయం పోయి దైర్యం వచ్చిందని, పేదరికం పోయి ఆర్ధిక భరోసా వచ్చిందని, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు రక్షణ కవచకుండలుగా ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా, సురక్షంగా ఉందని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో ఎంత ఆర్ధిక లోటు ఉన్నా పేదలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగుతుందని, త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని ఐటి శాఖమంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారని అన్నారు. ప్రజల ఆకాంక్షమేరకే పాలన సాగుతుందని గంటా నూకరాజు అన్నారు.
