Thursday, May 7, 2026
HomePoliticsAndhra Pradeshతిరుపతి లడ్డు పై అసత్య ప్రచారం చేసిన బాబు పవన్ రాజీనామా చేయాలి

తిరుపతి లడ్డు పై అసత్య ప్రచారం చేసిన బాబు పవన్ రాజీనామా చేయాలి

వెంకన్న స్వామి వారికి తగిన బుద్ధి చెప్పాలి,మాజీ డిప్యూటీ సీఎం బూడి ,పవిత్రమైన తిరుపతి లడ్డుపై అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. శనివారం మాడుగుల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. సందర్భంగా ఆయన వెంకన్న ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందంటూ వైసీపీ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అయితే పరీక్షల్లో లడ్డులో ఎలాంటి కల్తీ లేదని, కొవ్వు పదార్థాలు కలవలేదని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. దీనికి వారి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆనాడు వైసిపి ప్రభుత్వం భక్తులకు నాణ్యమైన లడ్డు ప్రసాదం అందించిందని, కానీ కూటమి ప్రభుత్వం వైసిపి పై జగన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. భక్తుల సమక్షంలో లడ్డుపై తప్పుడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజలకు భవిష్యత్తుగా క్షమాపణ చెప్పాలని నైతిక బాధ్యత వహించి వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వెంకన్న స్వామి కూడా వారికి తగిన బుద్ధి చెప్పాలని వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. చిత్తశుద్ధిలేని రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. లడ్డులో కొవ్వు కలిపారని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి మోసపూరిత మాటలు ప్రజలకు చెప్పే అధికారులకు వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు మోసగాడు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దారిలో పెడతారని భావించి ఆయన్ని నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మాటలు ఆయన వెంట పడుతున్నారని వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలు చేసి ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చే 19 గడుస్తున్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించారు. ఆనాడు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకే నేటి ఈ కుటుంబ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తుందని ఆనాడు మంజూరు చేసిన గ్రాంట్లే ఈ ప్రభుత్వం తిరిగి పనులు చేపడుతుందని దుయ్యపట్టారు. ఈ 19 నెలల కాలంలో కొత్తగా ఏమైనా పనులు చేశారా అంటూ ప్రశ్నించారు. ఆనాడు మేము చేసిన రోడ్లు బ్రిడ్జిల మీదే ఈరోజు కూటమి నాయకులకు తిరుగుతున్నారని మర్చిపోతున్నారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా పి ఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కేంద్రంతో సఖ్యతతో ఉండి ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధిని చేస్తారని ప్రజలు భావించారని కానీ ఆ దిశగా అడుగులు వేయలేదని కేవలం చంద్రబాబు మాయమాటలు పడ్డారని మండిపడ్డారు. పి ఆర్ వ్యవస్థలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు వివరించాలన్నారు. గత ప్రభుత్వంలో పి ఆర్ వ్యవస్థ బ్రష్టు పట్టిందని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ నాయకులు బూడి సమాధానం ఇస్తూ పిఆర్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని 175 నియోజకవర్గంలో రహదారులు భవనాలు బ్రిడ్జిలు ఎన్నో కట్టమని వాటిని కూటమి ప్రభుత్వం అనుభవిస్తుందన్నారు. మాడుగుల్లోనే కోట్ల రూపాయలతో నిర్మించిన పంచాయతీరాజ్ అత్యధిక గృహం నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గా వాడుకోవడం లేదా అంటు ప్రశ్నించారు. ఓకే మార్నింగ్ నియోజవర్గంలో అనేక రహదారులు బ్రిడ్జిలు ఉపాధి హామీ నిధులతో నిర్మించమని అవి కేంద్ర ప్రభుత్వం నిధులనీ చెప్పారు. ఈనాడు కూడా ఉపాధి పనులతో అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇప్పటివరకు రెండు లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం వాటితో ఏం చేశారని ఆ నిధులు దేనికి ఉపయోగించారని ప్రశ్నించారు. దీపం ఏమైందని పరిశీలించారు మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి ఇప్పటికి ఒక సెల్ఫీ ఇచ్చారని, సంక్రాంతి లాగా రోడ్లు పూర్తి చేస్తామన్నారని కానీ రెండు సంక్రాంత్రి వెళ్లిన రోడ్డు వంక ఎవరు చూడలేదన్నారు. 50ఏళ్ళు నుండి బీసీ వారికి పెన్షన్ అందిస్తామని, 18ఏళ్ళు నిండిన మహిళకు 1500 చెప్పున ఇస్తామని చెప్పిన హామీలు ఏమి అయ్యాయని ప్రశ్నించారు. అలాగే వైసిపి ప్రభుత్వం లో విద్యార్థులకు ఒక వరం లా ఉన్న అమ్మఒడి ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కి పుల్ స్టాప్ పడిందనే, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రిలో వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి అదనపు బస్సులు లేకుండా కాలం ఎలా తీస్తున్నారని దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. ఈ పథకం ప్రవేశ పెట్టేటప్పుడు ఉచిత బస్సులు తో పాటు పురుషులకు విద్యార్థులకు వేరే బస్సులు వేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. ముఖ్యంగా శ్రీవారి లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదని జంతు అవశేషాలు లేవని నిర్ధారణ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ప్రజలకు నేరుగా సమాధానం చెప్పాలని లేనియెడల ప్రజలు క్షమించరన్నారు. ఈ సమాజంలో ఎంపీపీ టీవీ రాజారాం, వైస్ ఎంపీపీలు కే శ్రీనివాసరావు,పి విజయలక్ష్మి, సర్పంచ్ కళావతి ఉపసర్పంచ్ వరహాలు, ఎంపీటీసీలు కే మహేశ్వరి, షేక్ ఉనీషా, పార్టీ నాయకులు, ఎస్ కొండలరావు, బి శ్రీనివాసరావు, మనలో గల అనేకమంది పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments