Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshవృద్దాశ్రమ నిర్వాహకులకు విరాళాన్ని అందించిన దాత..

వృద్దాశ్రమ నిర్వాహకులకు విరాళాన్ని అందించిన దాత..

శుభ కార్యక్రమాలసందర్బంగా ప్రతికుటుంబం ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఇతరులకు ఆదర్శం గా నిలవాలని నూతన జంట సందేశం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇటీవలే వివాహమైన షేక్ అయాన్, పాతీమునిషా దంపతులు రూ. 10వేల విరాళం శుక్రవారం ఇక్కడి బుట్టాయిగూడెం రోడ్డు లోని సీతామహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమానికి అందజేశారు. కుటుంబసభ్యులు ఆ మొత్తాన్ని తమ స్నేహితుడైన సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రమణ్యంల ఆధ్వర్యంలో ఈ మొత్తం అందజేయడంపై ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ హర్షం కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగాశేఖర్ మాట్లాడుతూ తమ ఆశ్రమంలో ఉన్నవృద్ధులకు ,వికలాంగులకు ఈ నగదు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.తమ ఆశ్రమంలో 25 మంది ఆశ్రయం పొందుతున్నారని దాతలు మరింతగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దూత ఉంటే దాతకు కొదవలేదని అన్నారు. ఈ సందర్బంగాకొత్త దంపతులు అయాన్ , మునిషాలను దాతలు ఆదర్శంగా తీసుకోవాలని శేఖర్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments