Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshఘనంగా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 16 వ వార్షికోత్సవం...

ఘనంగా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 16 వ వార్షికోత్సవం…

స్థానిక ఉడతావారి వీధి లో ఉన్న జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 16వ వార్షికోత్సవం ఘనం గా జరిగింది.
డిపాజిట్ దారుల సంక్షేమం లక్ష్యం గా బ్యాంకు పనిచేస్తోంది అని..ఇంతవరకు ధవళేశ్వరం శాఖ ద్వారా సుమారు 49 కోట్లు డిపాజిట్లు,41 కోట్లు రుణాలతో మొత్తం 90 కోట్లు వ్యాపారాన్ని సాధించడం చాలా సంతోషం అని ఛైర్మన్ బొమ్మన జయకుమార్ తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ బ్రాంచ్ ద్వారా 100 కోట్లు వ్యాపారాన్ని
అధిగమించాలని దానికి మీ అందరి సహకారం అందించాలని కోరారు.1926 వ సంవత్సరం లో ఈ బ్యాంక్ ప్రారంభించబడి అందరి ఖాతాదారుల ప్రోత్సాహం తో సహకార విలువలు పాటిస్తూ 2026 సంవత్సరం లో
శత వసంతాల వేడుకలు ఘనం గా జరుపుకొంటున్నామన్నారు.
ఇంతవరకూ 845 కోట్ల వ్యాపారం తో ముందుకు సాగుతూ 13 శాఖలతో మన బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పారు.బ్యాంక్ సభ్యులందరికీ 12 శాతం డివిడెంట్ ప్రకటిస్తున్నది అన్నారు. ఈ బ్రాంచ్ పురోభివృద్ధి కి సహకరిస్తున్న ఖాతాదారులందరికీ ధన్యవాదములు తెలిపారు. గోల్డ్ లోన్ ద్వారా గ్రాముకు 9200 రుణం ఇస్తున్నామని,ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని
సి ఈ ఓ విజయప్రతాప్ చెప్పారు. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ విజయశేఖర్ మరియు డైరెక్టర్స్ ,బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం కి విచ్చేసిన ఖాతాదారుల అందరికీ మేనేజర్ దేవి హారిక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments