Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshగురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం.

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం.

ఫిబ్రవరి 28లోగా ధరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.నరసింహమూర్తి. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు, 6,8,9వ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి గాను ఆసక్తిగల విద్యార్థుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.నరసింహమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో-80 సీట్లు, 6వ తరగతి-30, 8వ తరగతి-5, 9వ తరగతిలో-3 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి నెల 28వ తేదీలోగా https://aptwgurukulam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కానీ, లేదా పాఠశాలలో నేరుగా కానీ ధరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments