బుచ్చయ్యపేట మండలం వడ్డాది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కుష్టు వ్యాధి నివారణపై శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎంపీడీవో ఎం.వి.ఎస్. లోవరాజు, వైద్యులు డాక్టర్ రమ్య దుర్గ, డాక్టర్ మాధవి లత ముఖ్య ఆతిథులుగా విచ్చేశారు
ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో లోవరాజు మాట్లాడుతూ కుష్టు వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించాలని పేర్కొన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని ఆయన తెలిపారు.
డాక్టర్ రమ్య దుర్గ ,డాక్టర్ మాధవి లత సంయుక్తగా మాట్లాడుతూ.. చర్మంపై స్పర్శ లేని తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఏం డి టి (మల్టీ డ్రగ్ తెరిపి) మందులను ఉచితంగా అందజేస్తుందని వారు వివరించారు.
కుష్టు వ్యాధిగ్రస్తులను వివక్షకు గురిచేయకుండా, వారిని ప్రేమతో ఆదరించాలని, క్రమం తప్పకుండా మందులు వాడేలా ప్రోత్సహించాలని ఆరోగ్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
వడ్డాది లో కుష్టు వ్యాధి అవగాహన సదస్సు
RELATED ARTICLES
