Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshచరిత్ర మరువని శంబర సిరిమానోత్సవ ఆలసత్వం

చరిత్ర మరువని శంబర సిరిమానోత్సవ ఆలసత్వం

అంగరంగ వైభవంగా శంబర సిరిమాను సంబరం సూర్యాస్తమయానికి ముందే ముగించాలన్న కలెక్టర్ ఆదేశాలు గాలిలో కలిసిన వైనం కొట్టించినట్టు కనిపించిన కమిటి సమన్వయ లోపం మా లోపం లేదంటూ విస్మయానికి గురైన అధికారి ఘనం సిరిమానోత్సవాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ తదితర అధికారి యంత్రం  రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందిన, ఉత్తరాంధ్రల ఇలవేల్పు శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సినిమానోత్సవం మంగళవారం శంబరలో అంగరంగ వైభవంగా సాగింది. జాతర చరిత్రలో ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది సిరిమానోత్సవం గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. సిరిమానోత్సవం ఆలస్యం పై ఇటు భక్తులకు , అటు అధికారులు గ్రామస్తులను సైతం విస్మయానికి గురైనారు. గతంలో ఎన్నడూ సిరిమానోత్సవం ఈ విధంగా ఆలస్యంగా ప్రారంభం కాలేదు. గడిచిన నెల రోజులు అధికారి యంత్రాంగం చెమటోర్చి పనిచేసిన శ్రమ అంతా సిరిమానోత్సవం ఆలస్యంగా నిర్వహించడంతో వృధా అయ్యిందన్న ఆరోపణలు బహిరంగంగా వినిపించాయి. జిల్లా కలెక్టర్ తమ ఆదేశాలు ఆచరణలో అమలు చేయలేకపోయారన్న అపఖ్యాతి మూటకట్టుకున్నారనని భక్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. సూర్యాస్తమయానికి ముందు సిరిమానోత్సవం ముగించాలని కలెక్టర్ ముందస్తు ఆదేశాలు గాలిలో కలిసిపోయాయి. కలెక్టర్ ఆదేశాలకు బద్దవిరుద్దంగా మంగళవారం శంబర సిరిమానోత్వం గంటన్నర ఆలస్యంగా ప్రారంభించారు. ఒక దశలో సినిమానోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తుల సైతం విసుగు చెందిన పరిస్థితి ఏర్పడింది. తమ లోపం ఏమీలేదు..ఇది కేవలం గ్రామస్తుల సమన్వయ లోపమే..? ఇదీ కూడా ఒక అనుభమేనని జిల్లా స్థాయి అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేయడం విశేషం.! సిరిమానోత్సవం సాగింది ఇలా :-
ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతగాంచిన శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన మంగళవారం నాడు సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైన సిరిమానోత్సవం గ్రామాన్ని చుట్టుముట్టి సాయంత్రం ఆరు గంటల సమయానికి నడివీధిలోగల యాత్రాస్థలానికి చేరుకుంది. ముందుగా అమ్మవారి ఘటాలు బంగారపు పూతతో నిండు ముత్తైదువుల అలంకరించబడి చదురు గుడి నుండి నూతన వస్త్రాలపై నడుచుకుంటూ భార్యా భజంత్రీలు మధ్య సిరిమాను నిలిపే యాత్ర స్థలానికి చేరుకున్నాయి. తదుపరి సిరిమాను అధిరోహించేందుకు పూజారి జన్నిపేకాపు జగదీశ్వరరావును చదురు గుడి నుండి సిరిమాను వద్దకు భుజము పై ఎక్కించుకొని యువత కేరింతల మధ్య తీసుకువచ్చారు. తదుపరి పూర్వాచరం ప్రకారం జరపవలసిన ఆచారాలను ముగించి అమ్మవారు తొలి పూజ కోసం గిరిడ వారింటికి , రెండవ పూజ కోసం కుప్పిలి వారింటికి, మూడవ పూజ కోసం అప్పటి గ్రామం మొన్సబ్ ఇంటికి బయలుదేరారు. యాత్ర స్థలం నుండి అమ్మవారు బయలుదేరగా.. సిరిమాను కూడా తొలి పూజ కోసం గిరడ వారింటికి , రెండవ పూజ కోసం కుప్పిలి వారింటికి, తదుపరి మూడవ పూజ కోసం అప్పటి గ్రామం మున్సబ్ కుటుంబీకుల నుండి పూజలు అందుకున్నారు. తదుపరి అమ్మవారి ఘటాలు పణుకువీధి మీదుగా ఊరేగింపుకు బయలుదేరగా, సిరిమాను ప్రధాన వీధి గుండా పనుకు వీధి, తదుపరి గొల్ల వీధి, గాంధీనగరం గుండా చదురు గుడి వీది గుండా వచ్చి నడి వీధిలో సాయంత్రం ఆరు సమయంలో సినిమానోత్సవం ఊరేగింపు ముగించారు. పనుణుకు వీధి మీదగా ఊరేగింపు కెళ్ళిన అమ్మవారి ఘటాలు గొల్ల వీధి కొండవీటి తదితర వీధులు తిరువీధి చేస్తారు. రాత్రంతా తిరువీధి చేసి బుధవారం ఉదయం 10 గంటల సమయానికి గద్దె వద్దకు చేరుకుంటారు. మధ్యలో అమ్మవారు అర్థరాత్రి సమయంలో నడివీధిలో గల గద్దెకు చేరుకొని కాసేపు అక్కడ ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు తిలకిస్తారు. తదుపరి మరల తిరిగి వీధికి పయనమవుతారు. సినిమానోత్సవం సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. సినిమానోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎం మాధవరెడ్డి, ఏ ఎస్ పి మనీషా వంగనపూడి, పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి, పాలకొండ సబ్ కలెక్టర్ తోపాటు పలువురు అధికార ఘనం నేతృత్వంలో సిరిమానోత్సవం విజయవంతంగా ముగిసింది. అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు :మంగళవారం శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ కార్య నిర్వహణ అధికారి బి శ్రీనివాస్ , తదితర అధికార రాజకీయ నాయకులు స్వాగతం పలికారు. అలాగే పాలకొండ ఎమ్మెల్యే నిమ్మకి జయ కృష్ణ , కురుపాం తోయిక జగదీశ్వరి తదితర రాజకీయ ప్రముఖులు శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments