Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshశ్రీ రాజ్యశ్యామల మాతగేశ్వరి సహిత రుద్రయాగం లో పాల్గొన్న చొక్కాకుల

శ్రీ రాజ్యశ్యామల మాతగేశ్వరి సహిత రుద్రయాగం లో పాల్గొన్న చొక్కాకుల

జీవీఎంసీ 71 వ వార్డు, శ్రీరామనగర్ లో శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ అమ్మవారి ఆలయం లో బ్రహ్మనాయుడు దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ రాజ్యశ్యామల మాతగేశ్వరి సహిత రుద్రయాగం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మాధురి దంపతులతో పాటు బిజెపి సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు* పాల్గొన్నారు. నిర్వాకులు మాధవ్ దంపతులకు పూర్ణ కుంబంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి, తీర్థప్రసాదములు స్వీకరించారు. తదనంతరం గాజువాక లంకామైదానం లో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ రాజ్యశ్యామల మాతగేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పి. శ్రీనివాసరావు, పైడపునాయుడు మరియు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments