Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshచెముడు లో పశు వైద్య శిబిరం ఏర్పాటు

చెముడు లో పశు వైద్య శిబిరం ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వం పాడి అభివృద్ధికి ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకొని పాడి సంపదను మరింత అభివృద్ధి చేయాలని సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ , మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలంలో చెముడు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాడి రైతుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాలను రైతులు సద్విని చేసుకొని పాడి సంపద మరింత పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు. పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో చెముడు గ్రామంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరం వైద్య శిబిరంలో లేగ దూడలు ప్రదర్శన చేశారు. ప్రదర్శనలో 50 లేగ దూడలను రైతులు ప్రదర్శించారు. ప్రదర్శనలో పాల్గొన్న లేక తోటలకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేశారు. పశు వైద్య శిబిరంలో గర్భకోస చికిత్స నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా 75 జనరల్ కేసులు, సూలు నిలబడిన , ఎదకురాని 68 పాడి పశువులకు వైద్యం సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెముడు సర్పంచ్ ప్రతినిధి బొంగు భీమలింగేశ్వరరావు , ఎంపీటీసీ చింతల గోపాలకృష్ణ , గ్రామ టిడిపి నాయకులు భూషణరావు , సాలూరు పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ గంగాధర్, పశువైద్యాధికారి కె పొలందొర , ప్రభాకర్ , ప్రియాంక తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments