రాష్ట్ర గిరిజన జాతర గా గుర్తింపు పొందిన పోలమాంబ అమ్మవారి జాతర అన్ని శాఖలు అధికారులు నిరంతర పర్యవేక్షణతో ఘనంగా జరిపించాలని సబ్ కలెక్టర్ వైశాలి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక చదురు గుడి క్యూలైన్ల వద్ద దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాస్ అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరను నాలుగు జోన్లు పర్యవేక్షణ జోన్లుగా విభజించడం జరిగిందని తెలిపారు. ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. కొత్తగా అధికారులతో నిర్వహణ జరుపను న్న పార్కింగ్ మరియు దుకాణాలకు సంబంధించి బాధ్యతలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉండాలని డిపిఓ ఏడుకొండలు డిఎల్పిఓ నాగభూషణం సూచించారు. ఏ చోట్ల పార్కింగ్ స్థలాలు, దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు పూర్తిగా డాక్యుమెంట్ రూపంలో ఇవ్వాలన్నారు. ఏ శాఖ కూడా పిడిఎఫ్ లో తమకు పంపరాదని ఆమె సూచించారు. గతంలో మాదిరిగా ప్రతి దుకాణానికి తగు రసీదు అందజేస్తామని పంచాయతీ అధికారులు సబ్ కలెక్టర్కు వివరించారు. వసూలైన నగదును ఒకటి రెండు రోజులలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. పార్కింగ్ లకు 20 30 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు. సాలూరు సిఐ రామకృష్ణ మాట్లాడుతూ పోలీస్ రూట్ మ్యాప్ ను వివరించారు. అలాగే సినిమాను రహదారుల్లో ఏర్పాటు చేస్తున్న బందోబస్తు వివరాలను కూడా వివరించారు. తలనీలాలు కోళ్లు కోయడం వంటి కార్యక్రమాలన్నీ వేరువేరు చోట్ల కాకుండా ఒకే చోట ఉండేలా చూడాలనీ,. జాతర సందర్భంగా పరిశుభ్రత పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం క్యూలైన్ పరిసరాలను వనం గుడి వద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్లను ఆమె పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చిన్న తిరుపతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
పోలమాంబ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిద్దాం ……సబ్ కలెక్టర్ వైశాలి
RELATED ARTICLES
