వీఎంఆర్డీఏ ఎమరాల్డ్ వ్యాలీ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి నియోజకవర్గం శర వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకు తగ్గట్లుగా వసతులు కల్పించాల్సిన అవసరం వీఎంఆర్‌డీఏపై ఉందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తిలో వి.ఎం.ఆర్.డి.ఏ అభివృద్ధి చేసిన ఉడా అప్రూవ్ ఎమరాల్డ్ వ్యాలీ లేఅవుట్ ను వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలసి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని వినియోగించి ప్రజల గృహ అవసరాలు తీర్చాలని వి ఏం ఆర్ డి ఏ చైర్మన్, కమిషనర్లకు సూచించారు. చైర్మన్ ప్రణవ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ లు మాట్లాడుతూ నగర ప్రజలకు నాణ్యమైన ధరలో సౌకర్యంతమైన నివాసాలు అందించడానికి వీఎంఆర్డీఏ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కనీసం 1000 మందికి కొత్త నివాసాలు అందిస్తున్నామని తెలిపారు. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందు న అందుకు తగ్గట్లుగా నగరంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసి నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చిన్నముసిడివాడ లో ఏర్పాటుచేసిన ఎమరాల్డ్ వ్యాలీ లేఅవుట్ 4.7 ఎకరాల్లో 3.5 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు, వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్, డిబిఎల్ సంతోష్, పిన్నింటి పార్వతి, పెందుర్తి ఏఎంసీ డైరెక్టర్ ఆర్.ఎస్ నాయుడు, హైమావతి స్థానిక నాయకులు డుంబారి రామారావు, కిషోర్ చౌదరి, హరి గోపాల్, గన్రెడ్డి నగేష్, కిషోర్, జీవీఎంసీ 97వ వార్డు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
