Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshకేజీహెచ్‌లో చక్రం తిప్పుతోన్న లేడీ డాన్ ....!

కేజీహెచ్‌లో చక్రం తిప్పుతోన్న లేడీ డాన్ ….!

` ఆ ఉద్యోగుల భరతం పడతాదట
` తప్పుల తడకల ఫైళ్లపై సంతకాలు చేయకపోతే అంతేనట
`
కేజీహెచ్‌లో సిత్రాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులపై ఒకరికొకరు ఫిర్యాదు చేసుకునే కొత్త సంస్కతికి తెర లేచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మినిస్టీరియల్ ఉద్యోగుల్లో చీలిక దిశగా అడుగులు పడుతున్నాయి. నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో అవినీతి వర్గమే పై చేయి సాధించేలా కనిపిస్తోంది. ఎందుకంటే డబ్బుకు ఎవరినైనా ఏ క్షణంలోనైనా తమ వైపునకు తిప్పుకోగల శక్తి ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. వాటాలు దండిగా దండుకునే బ్యాచ్‌లో ప్రసిద్ది చెందిన ఓ మహిళా ఉన్నతోద్యోగి ఎవరి మెప్పు కోసమో గానీ మినిస్టీరియల్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. విభజించి పాలించు అనే సూత్రాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె ఉద్యోగులకు వ్యతిరేకంగా సంతకాలు చేయించే పనిని కింది స్థాయి ఉద్యోగులకు అప్పగించడం వెనుక మర్మం ఏంటో కేజీహెచ్ ఉద్యోగుల మొత్తానికి తెలిసిపోయింది. దీంతో ఇప్పుడు ఆమె అవినీతి చిట్టాను బయట పెట్టేందుకు మూకుమ్మడిగా సిద్దపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైద్య ఉద్యోగులకు చెందిన ప్రభుత్వ నిధులను దాదాపు రూ. 30 లక్షల వరకూ డ్రా చేసేసి అడ్డంగా బుక్కయిపోయి సస్పెన్షన్‌తో కొంత కాలం గిరిజన గూడేల్లో తిరిగి మళ్లీ ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసి హెల్త్ డైరెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో కాళ్ల బేరాలకు దిగి విశాఖకు వచ్చిన ఆ లేడీ డాన్ ఇప్పుడు కేజీహెచ్‌లో చక్రం తిప్పుతోంది. తనకు రావాల్సిన వాటాల కోసం ఏ మాత్రం సిగ్గు లేకుండా దండుకునే ఆమె పని తీరు పూర్తిగా అవినీతి మయమే. విశాఖలో పని చేస్తున్నప్పుడు కూడా ఒకటి రెండు సార్లు సస్పెన్షన్‌కు గురైన చరిత్ర ఆమెది. కానీ ఇప్పుడు ఆమె ఎవరి మెప్పు కోసమో తన సర్వీసు మొత్తం ఫణంగా పెట్టి నిఖార్సైన ఉద్యోగుల భరతం పట్టేందుకు అవినీతి అధికారులతో చేతులు కలిపినట్టు ఆ ఆస్పత్రి వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్‌జీవోలు కూడా సమయం చూసుకుని కేజీహెచ్‌లో జరుగుతున్న ఉదంతాలను ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళికంగా అడుగులు వేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments