Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshవైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు..

వైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు..

విశాఖ జిల్లా వైస్సార్సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *కె.కె రాజు పాల్గొన్నారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మిత్రులకు, శ్రేయోభిలాషులకు,పార్టీ నాయకులకు కార్యకర్తలకు, ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి కు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది నుంచి కూటమి ప్రభుతం అహంకారం తగ్గి, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని . ఈ పరాభవ నామ సంవత్సరంలో కూటమి పాలకులకు పాలకులకు జ్ఞానం కలిగి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి అధికారం ఇచ్చారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వపు బాధ్యత. అయితే ప్రస్తుతం మాటలలో సత్యం, ధర్మం గురించి చెప్పి, కార్యాచరణలో వాటికి విరుద్ధంగా వ్యవహరించడం ఆందోళనకరం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం ద్వారా మాత్రమే నిజమైన పాలన సార్థకం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో భక్తి, విశ్వాసంతో ఆరాధించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కటాక్షం అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరంలో భక్తుల మనోభావాలు, వారి విశ్వాసాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.తెలిపారు ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments