Monday, April 20, 2026
HomeNewsసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ (MCPC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సివిల్ ప్రొసీజర్ కోడ్–89 ప్రకారం వివాదాలను ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులకు అప్పీల్ అవకాశం ఉండదని, తద్వారా కోర్టులపై భారం 25 నుంచి 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్, భూసేకరణ, ఎగ్జిక్యూటివ్, ఎంవీఓపీ కేసులు పరిష్కరించవచ్చని, కోర్టు ఫీజు తిరిగి లభిస్తుందని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం జనవరి 19 నుంచి 23 వరకు జిల్లా న్యాయ సేవల అథారిటీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, మాస్టర్ ట్రైనర్లు ఎస్.హెచ్. సురేందర్ సింగ్, పి.ఎం. మొహమ్మద్ షిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments