Tuesday, May 5, 2026
HomePoliticsAndhra Pradeshసకాలంలో రుణo చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ

సకాలంలో రుణo చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ

సహకార సంఘాల ద్వారా రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రైతు అందించడం జరుగుతుందని కింతలి సహకార సంఘం అధ్యక్షుడు ఉండూరు దేవుడు తెలిపారు. మంగళవారం సంఘ మహాజనసభ ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యకలాపాలను ఆయన వివరిస్తూ.. సంఘంలో సుమారు 2000 మంది సభ్యులు ఉన్నారని, వారి వాటదనం కోటి రెండు లక్షల 43 వేల రూపాయలు ఉందన్నారు. ఈ సొసైటీ ద్వారా ఆరు కోట్లు పంట రుణాలు, మరో ఆరు కోట్లు మార్ట్ గేజ్ రుణాలు, దీర్ఘకాలిక రుణాలు 17 లక్షల రూపాయలు, జే ఎల్ జి ఎస్ సి ఓ ఎం టి ఓ రుణాలు మూడు లక్షల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. మొత్తం 12 కోట్ల 20 లక్షల రూపాయలు రుణాలుగా అందజేశామని చెబుతూ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రైతు చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే సంఘ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రెండు లక్షల రూపాయలు, 59 సంవత్సరాలలోపు వారు సహజ మరణం పొందితే 50000 రూపాయలు, 60 ఏళ్లు పైబడ్డవారు మరణిస్తే 25 వేల రూపాయలు పరిహారంగా అందజేయడం జరుగుతుంది అన్నారు. అలాగే ఏడు శాతం వడ్డీ పై పంట రుణాలు, 12: 50 శాతం వడ్డీపై మార్ట్గేజ్ రుణాలు అందిస్తున్నామని రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరం లావాదేవులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సంఘ సీఈవో పోతు రమేష్ వార్షిక నివేదిక సమర్పించారు. సంఘ సభ్యుడైన పొంగలిపాక రైతు మరణిస్తే ఆయన భార్య దేవుడమ్మకు 25000 చెక్కునుఈ సందర్భంగా అందజేశారు.ఈ
సభలో సంఘ డైరెక్టర్లు గణేష్, అర్జున, ఎంపీటీసీ మైచర్ల సన్యాసిరావు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments